Let’s put plows and plow in illegal venture..
అక్రమ వెంచర్ లో నాగళ్లు పెట్టి దున్నుతాం..
అక్రమ వెంచర్ ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు.
సాక్షిత ప్రతినిధి.
రక్షణ కౌలు దారులకు రక్షణ కల్పిస్తాం.
బీఆర్ఎస్ గుండాల భరతం పట్టేది కాయం.
దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా.
ఊరుకొండ:
గత 60 ఏళ్లుగా రక్షణ కౌలు దారులుగా ఉంటూ నలభై రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితుల పొట్ట కొట్టి అక్రమంగా ఊరుకొండ మండల ప్రధాన రహదారిపై 401, 402, 410 సర్వే నెంబర్లలో దౌర్జన్యంగా అక్రమ వెంచర్ ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి బినామీ అయిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అతని అనుచరులు ప్రశ్నించిన గొంతులను నొక్కి చంపాలని చూసిన సంఘటన పాఠకులకు విదితమే.
అక్రమ వెంచర్ లో జెసిబిలు పెట్టి చదును చేసి నాగళ్ళు పట్టి దున్నుతామని దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ దేవని సతీష్ మాదిగలు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క భూములను లాక్కుని భూకబ్జాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ఊరుకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ మండల అధ్యక్షులు గడ్డం మహేందర్ మాదిగ, ఊర్కొండ మండల అధ్యక్షులు ఓర్సు ఆంజనేయులు ఆధ్వర్యంలో .. ఎంజేఆర్ టౌన్ షిప్ లో భూ అక్రమాలు జరిగిన విషయాన్ని సంబంధిత అధికారలకు తెలియజేసి నేటికి సుమారుగా 10 రోజులు అవుతున్నా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంచర్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మరియు భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి వీరితో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సీనియర్లు సతీష్ మాదిగ, కల్యాణ్ నాయక్, శ్రీమతి బాల త్రిపుర సుందరి, పాలమూరు జిల్లా దళిత మోర్చఅధ్యక్షులు కొంగలి శ్రీకాంత్ లు మాట్లాడుతూ..
రక్షణ కౌలుదారులుగా ఉంటున్న దళితులకు భూమి ఇప్పించి.. వారికి రక్షణ కల్పించే వరకు ధర్మ యుద్ధం ఆగదని ప్రకటించారు. దళిత రైతుల పొట్ట కొట్టి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసుకొని కోట్లు గడించడం మోసపూరితమని దుయ్యబట్టారు.
అవినీతి అక్రమలపై ప్రశ్నించిన ఓపిసి జిల్లా అధ్యక్షుడు, నర్సంపల్లి సర్పంచ్ వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ పై దౌర్జన్యంగా దాడికి పాల్పడిన బీఆర్ఎస్ గుండాల భరతం పడతామని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములు అక్రమంగా లాకుంటే రాబోయే కాలంలో పుట్టగతులు ఉండవని విమర్శించారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించిన నాయకులను, పత్రికల్లో రాసిన దళిత జర్నలిస్టులను టార్గెట్ చేసి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించడం పిరికిపంద చర్య అని విమర్శించారు.
ఏది ఏమైనా అక్రమ వెంచర్ ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు రాజేష్, రాఘవెందర్ గౌడ్, సూర్య కృష్ణ గౌడ్, వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, శామల, నరసింహులు, బిజేవైఎమ్ నాయకులు పల్లె తిరుపతి, నరేష్ చారి, మహిళ మోర్చ నాయకురాలు సాహితీ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు,
కల్వకుర్తి టౌన్ రూరల్ అధ్యక్షులు నరసింహ, సురేందర్ గౌడ్, జడ్చర్ల టౌన్ రూరల్ అధ్యక్షులు రమేష్ జి, నాగరాజు, మిడ్జిల్ మండల అధ్యక్షులు కావాలి నరేందర్, ఊరుకొండ మండల నాయకులు, పదాదికారులు, కార్యకర్తలు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓర్సు అంజనేయులు, ఓబీసీ మోర్చ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు పరుషరములు, వెంకటేష్, రాజేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.