వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమిద్దాం

Spread the love

Let’s move until Vaddera is included in the ST list

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమిద్దాం
…….. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవళ్ళ దుర్గారావు పిలుపు

వినాయకపురంలో అశ్వారావుపేట మండల వడ్డెర సంఘం సమావేశం

బారీగా హాజరైన వడ్డెర కులస్థులు

సాక్షిత న్యూస్ అశ్వారావుపేట : వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమించాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు దేవుళ్ళ దుర్గారావు పిలుపునిచ్చారు. వినాయకపురం గ్రామంలోని చిలకల గండి ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972 వరకు ఎస్టి క్యాటగిరి లో ఉన్న వడ్డెరలను బీసీ జాబితాలో చేర్చడం అక్రమమని, ఆనాటి నుండి ప్రభుత్వ పాలకులను వడ్డెరలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నామని, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు హామీ ఇచ్చారని, అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వ పాలకులు మా న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించలేకపోయారని రిజర్వేషన్ కోల్పోవడం వలన వడ్డెర కులస్తులకు అనేక విధాలుగా నష్టం వాటిల్లిందన్నారు.

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చైర్మన్ శివరాత్రి అయిలమల్లు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వడ్డెరలను తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వడ్డెరలను బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని, వడ్డెర కార్పొరేషన్ కు 1000 కోట్లు నిధులు ఇవ్వాలని, ప్రతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ పనుల్లో 20 శాతం కాంట్రాక్టులు వడ్డెర్లకు కేటాయించాలని, క్వారీల పైన పూర్తి హక్కులు కల్పించాలని, వడ్డెర కార్మికులందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని, వడ్డెర కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వడ్డెర జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులను వడ్డెరలకు కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెర్లకు అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పటికే వడ్డెర కులస్తుల డిమాండ్లపై అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు ర్యాలీలు నిర్వహించి స్థానిక తహసీల్దారులకు వినతి పత్రాలు అందజేశామని, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుందని, భవిష్యత్తులో జరగబోయే ఉద్యమంలో వడ్డెర సోదరులందరూ పాల్గొని ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం వడ్డెర సంఘం అశ్వారావుపేట మండల కమిటీని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి శ్రీను, వల్లెపు రామచంద్రరావు, డేరంగుల వెంకయ్య, డేరంగుల ప్రసాద్, డేరంగుల చంటి, వల్లెపు భాస్కర్, మక్కళ్ళ వెంకటేశ్వరరావు, ఆకుల నాగముత్యం, ఆకుల నరసింహారావు, బండారు మహేష్, శివకాశి కొండయ్య, చంద్రరావు, రాములు, బండారు వెంకటేష్, శివరాత్రి శ్రీరామ్మూర్తి, రాఘవులు, వల్లెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page