Legislators participating in the inauguration ceremony of Arama Kshetra
ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,ఎమ్మెల్యే ముస్తఫా
సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డు నందు గల ఖబరిస్తాన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , గుంటూరు తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి ఆరామ క్షేత్రంను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
అనంతరం జామియా మసీదు రెండోవ అంతస్తు.. దర్వాజ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని కొబ్బరి కాయ కొట్టారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అద్దె ఇళ్లలో నివాసం ఉండే వారు ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాన్ని ఎక్కడికి తేసుకొనివెల్లాలో తెలియక.. కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని.. అలాంటి కష్టం ఎవరికి రాకూడదు అని ఉద్దేశంతో ఇవాళ ఆరామ క్షేత్రం నిర్మించుకొని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు
ముస్లింలకు ఇచ్చిన ప్రతి మాట నిరవెర్చే దిశగా ముందుకు సాగడం జరుగుతుంది అన్నారు. 100 ఏళ్ల చరిత్ర గల జామియా మసీదు నిర్మాణ పూర్తి చేసి.. అంజుమన్ కాంప్లెక్స్ కూడా పూర్తి చేస్తామన్నారు. అలాగే రామిరెడ్డి పేట ప్రాంతంలో మరొక ఖబరిస్థాన్ నిర్మాణ కొరకు కూడా చూస్తున్నాం అన్నారు
ముస్లింల కోసం ఇంతలా ముండగులు వేస్తుంటే.. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అరవింద బాబు పని చేస్తున్నారు అని విమర్శించారు. అరవింద బాబుకు ముస్లింల మీద ప్రేమ ఉంటే కోర్టులో వేసిన కేసులు వెన్నక్కి తెసుకోవాలని అన్నారు