వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు కేసీఆర్ ఘనత – శాసన మండలి చైర్మన్ గుత్తా
ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
చిట్యాల సాక్షిత
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాడు రైతు దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోనీ రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు,రైతు భీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి అన్నారు.నల్లగొండ జిల్లా రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10వేల రూపాయల చొప్పున రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 4,83,179 మంది రైతులకు 5,244 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది అన్నారు.విధివశాత్తు ఏ రైతు అయిన మరణించిన 10 రోజుల్లో అతని కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల భీమా సొమ్మును రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నామని అన్నారు .ఈ పథకం ద్వారా 2018 నుండి 2023 ఏప్రిల్ వరకు 6 వేల 256 మంది రైతు కుటుంబీకులకు 312 కోట్ల 8 లక్షల రూపాయలు అందించామని తెలిపారు.
పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ,రైతులను ఆదుకొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు .జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 10వేల 879 కోట్లు రైతులకు చెల్లించడం జరిగిందని చెప్పారు. వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలపై రైతులు చర్చించుకుందుకు వీలుగా ప్రతి 5వేల ఏకరాల క్లస్టర్ లకు ఒక రైతు వేదికను అందుబాటులో కి తేవడం జరిగిందన్నారు.రాష్ట్రంలో 2600 రైతు వేధికలను సర్కార్ నిర్మించిందన్నారు. నల్గొండ జిల్లాలో 140 క్లస్టర్ గ్రామాలలో 30 కోట్ల 80 లక్షల రూపాయలతో 140 రైతు వేదికలు నిర్మించామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహం అందిస్తున్నదని ఆయిల్ ఫామ్ మొక్కలు,డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లకు భారీ సబ్సిడీని సర్కార్ అందిస్తుందని అన్నారు.అలాగే ఉదయ సముద్రం ,బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.పిలాయిపల్లి ,ధర్మ రెడ్డి కెనాల్ ల పనులు దగ్గర పడ్డాయని రానున్న వర్షాకాలంలో ఆ కాలువల ద్వారా చెరువులను నింపుతామని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్నీ ప్రజలు ఆదరించాలని ,రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు అనంతరం స్వయంగా రైతులందరికీ భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీఏ సుచరిత,
ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి, వ్యవసాయ అధికారి గిరిబాబు ఎంపిటిసి పెద్దబోయిన సత్తయ్య యాదవ్, ఏఈఓ వికాస్, వివిధ గ్రామ సర్పంచ్ లు లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.