SAKSHITHA NEWS

సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్

అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి రెండు సంవత్సరములు గడుస్తున్న ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ఆరోపించారు.

నాడు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక యంఆర్ ఓ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న సమ్మె నాలగ వ రోజు కు చేరుకున్న సందర్భంగా సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ సంఘీభావం తెలియజేసింది.అనంతరం ఆపార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ గుణవర్థన్ లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే తెలంగాణకు మించిన వేతనాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడీలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని పిల్లలు గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఒకవైపు చాలీచాలని వేతనాలతో మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో కొనుగోలు చేయలేక అంగన్వాడి వర్కర్స్ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులలో వేతనాలు పెంచాలని ఎన్నో సంవత్సరముల నుండి న్యాయబద్ధమైన ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు మరోవైపు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఉండాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు అంగన్వాడీ సిబ్బందికి పిఎఫ్ గ్రాడ్యుట్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు 2015 సంవత్సరం నుండి అంగన్వాడీ సిబ్బందికి టిఏ బిల్లులు ఇవ్వలేదని దీంతో వీరంతా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు

ఇప్పటికైనా బకాయిలు మంజూరు చేయాలని అలాగే సర్వీసులో ఉండి మృతి చెందిన వారి కుటుంబం నుండి మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు ఇలాంటి సమయంలో మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడడం నరైంది కాదన్నారు దీనికి తోడు ఏకంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టే పరిస్థితి వచ్చిందంటే అంగన్వాడీ లకు దీక్షలకు జంకినట్లే నన్నారు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు జరిగే పోరాటాలకు సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వ పాలన సాగిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా అపస్కృతంగా ఉన్న అంగన్వాడి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు.తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీలంతా ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ పక్షాన పిలుపునిచ్చారు.

WhatsApp Image 2023 12 15 at 2.49.07 PM

SAKSHITHA NEWS