విలేకరుల ముసుగులో లక్షల రూపాయలు దోచేశారు. వివరాలు అడిగితే దౌర్జన్యం

Spread the love

తిరుపతి జిల్లా…గూడూరు

విలేకరుల ముసుగులో లక్షల రూపాయలు దోచేశారు. వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు.జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి పేరుతో,తాము పనిచేస్తున్న సంస్థల పేర్లు చెప్పి లక్షల రూపాయలు దోచుకున్న 5 మంది పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గూడూరు వన్ టవున్ సీఐ హజరత్ బాబును ఆశ్రయించిన గూడూరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు.తామే గూడూరు ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా మొత్తానికి ప్రతినిధులం అని జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి పేరుతో గూడూరు నియోజకవర్గంలో ప్రముఖుల నుండి 50 లక్షలు పైన వసూలు చేయడం,వసూలు చేసిన డబ్బులు వివరాలు అడిగితే తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వారి నుండి తమకు రక్షణ కల్పించాలని విలేకరులు కోరుతున్నారు.వారి పిర్యాదు మేరకు గూడూరు RC గా సాక్షి పత్రికలో పనిచేస్తున్న గూడూరు కు చెందిన పుచ్చల పల్లి శ్రీనివాసులు రెడ్డి,ప్రజాశక్తి పత్రికలో పనిచేసే గుమ్మడి శశిధర్@ సునీల్,కాకతీయ పత్రికలో పనిచేసే కడివేడు కు చెందిన వెంకయ్య,మారో పత్రికలో పనిచేసే చెన్నూరుకు చెందిన విజయ్, ఏ పత్రికలో కానీ టీవీ లో కానీ పని
చేయని గారా ధనుంజయ ఒక గ్రూప్ గా చేరి గూడూరు లో విలేకర్లు కోసం ఇందిరా నగర్ లో కేటాయించిన ఇళ్ళ స్థలాల అభివృద్ధి పేరుతో గూడూరు నియోజకవర్గంలో ని
ప్రముఖ డాక్టర్ CR రెడ్డి వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు,వ్యాపార వేత్త పొనకా శివకుమార్ రెడ్డి దగ్గర 5 లక్షలు,పెన్వర్ కంపెనీ డైరెక్టర్ గంటా మధు దగ్గర 5.5లక్షలు,ప్రముఖ బిల్డర్ చంద్ర దగ్గర 4 లక్షలు ఇలా అనేక మంది నుండి సుమారు 40 నుండి 50 లక్షలు పైన డబ్బులు వసూలు చేశారనీ ఈ విషయం తెలిసి నిజాయితీగా ఎంతో కష్టపడి చేస్తున్న విలేకరులుకు లక్షలాది రూపాయలు దండకము గురించి తెలిసి పై 5 మందిని వివరాలు అడగగా వారిలో కొందరు
దౌర్జన్యానికి దిగుతూ మీ దిక్కున చోట చెప్పుకోండి ఏమి చేస్తారో చేసుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేయడం తో పాటు ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఈ 5 మంది పై కఠిన చర్యలు తీసుకోవాలని
గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ఆత్మకూరు సురేష్, జమాలుల్లా,బాలకృష్ణయ్య,వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం,రఘు తదితరులు గూడూరు ఒకటో పట్టణ CI హజరత్ బాబును కలిసి తమకు న్యాయం చేయవలసిందిగా కోరి వినతి పత్రం సమర్పించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page