జీడిమెట్లలోని హమాలీ వర్కర్స్ యూనియన్ వద్దా ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంతో హయాంలో కార్మికుల, కర్షకుల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మణ్, హమాలి సంఘ సభ్యులు బీరప్ప, స్వామి, దేవదానం, సుంకి రెడ్డి, దుర్గా నాయక్, భాష, అశోక్ రెడ్డి, దుర్గయ్య, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.