సూరారం 129 డివిజన్ లో కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా!

Spread the love

రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్ బస్తీలలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ సూరారం 129 డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్ కాలనీల్లో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా బస్తీల్లోని ప్రజలు రోడ్లు, డ్రైనేజ్, త్రాగు నీరు, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బస్తీల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పేరిట దళితులను మోసం చేసినట్టే, బిసి రుణాల పేరిట బిసిలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యాడని అన్నారు. గతంలో బిసి రుణాలకు వచ్చిన ఐదు లక్షల దరఖాస్తులు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే బీజేపీ తరపున ఆందోళనలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దుర్యోధన రావ్, డివిజన్ ఇంఛార్జ్ రాజిరెడ్డి, డివిజన్ నాయకులు చండి శ్రీనివాస్, బావిగడ్డ రవి, పత్తి రఘుపతి, కూన రఘు గౌడ్, సురేష్ గౌడ్, వారాల మహేష్, నాగరాజు, పృద్వి, సైదులు, దీపక్ అంబేకర్, వెంకటేష్ గౌడ్, రవీందర్ గౌడ్, శంకర్ గౌడ్, శంకర్ నాయక్, వేణు గౌడ్, విజయ లక్ష్మి, సాయిజైవంత్, బస్తీల నాయకులు బాలయ్య, వెంకట్ రెడ్డి, హరీష్ గౌడ్, సిద్దార్థ్, సాయి, అనిల్, నవీన్ యాదవ్, అశోక్ గౌడ్, బాలరాజు, ప్రేమ్, అండాలు, వేణు, సురేష్, మొగలప్ప, చంటి, నవీన్, రాఘవ, రమేష్, గురు నారాయణ, కిరణ్, రాజు, రజాక్, మౌనేష్, శ్రీశైలం, రాజు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page