కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా

Spread the love

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం – కూన శ్రీశైలం గౌడ్..
శ్రీరామ్ నగర్, బాపు నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, సంజీవయ్య నగర్ బస్తీల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర…

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేపట్టిన పాదయాత్ర కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బాపు నగర్, బాపు నగర్ వీకర్ సెక్షన్ కాలనీ, సంజీవయ్య నగర్ బస్తీల్లో సాగింది. ఆయా బస్తీల్లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్రకు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి శ్రీశైలం గౌడ్ కి తమ మద్దతును తెలిపారు. పాదయాత్రలో ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలు సిసి రోడ్లు, డ్రైనేజ్ నీరు రోడ్లపై పారడం, రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి సమస్యలను దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణలో కెసిఆర్ అరాచక పాలన అంతానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. బాబాయ్ – అబ్బాయిల పరిపాలనలో కుత్బుల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. వర్షాలు పడితే రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న మిలిటరీ సరిహద్దుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి యేనని రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్, డివిజన్ ఇంఛార్జ్ బిల్లా వెంకటేష్, సెన్సార్ బోర్డు సభ్యులు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నటరాజ్ గౌడ్, నాయకులు శ్రీధర్ వర్మ, దయాకర్, విజయ్ గుప్తా, నందకిషోర్, శ్రీధర్, లింగం యాదవ్, సత్యం, ప్రవీణ్, గంజి శ్రీనివాస్, కిరణ్ యాదవ్ విజయ్ కుమార్, వీరేందర్ గుప్తా, స్వాతి రెడ్డి, కృష్ణ గుప్తా, జానయ్య, రవి గౌడ్, భూషణం గౌడ్, శ్రీధర్, విజయ్ కుమార్, నర్సింహా చారి, ప్రతాప్ రెడ్డి, బిజెపి అభిమానులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page