SAKSHITHA NEWS

కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసి రాస్తా రోకో నిర్వహించిన NMD ఫిరోజ్

ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పై వైసీపీ పార్టీకి చెందిన గుండాలు చేసిన దాడిని ప్రజాస్వామ్యం పై చేసిన దాడిగా పరిగణించి వైసీపీ గుండాల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మార్వో కి వినతిపత్రం పత్రాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి అందించి ఎమ్మార్వో ఆఫీసు ఎదుట రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేశారు .

ఈ సందర్భంగా NMd ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మూల విలేకరుల పై దాడులు జరగడం సిగ్గుచేటన్నారు.

విలేకరుల పై దాడులనేవి ప్రజాస్వామ్యనికి హానికరమని ఈ దాడులు నియంత పాలన వైపు తీసుకువెళ్తాయని అన్నారు..

గతంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వచ్చినప్పుడు కూడ ఇదే కర్నూలులో వైసీపీ పార్టీ గుండాలు విలేకరుల పై దాడులు చేశాయని అన్నారు, అప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే విలేకరుల పై దాడులు జరిగేవి కావన్నారు.

ఇటీవల సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి మరువకముందే మరొక దాడి జరగడం బాధాకరమని వెంటనే ఈ దాడులకు పాల్పడ్డ గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని NMd ఫిరోజ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నంద్యాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 21 at 12.35.24 PM

SAKSHITHA NEWS