SAKSHITHA NEWS

భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ వ్యాఖ్యలు…….

Whatsapp Image 2023 11 19 At 5.28.25 Pm

భద్రాచలం వచ్చినప్పుడు కచ్చితంగా రాముడి పాదాలకి నమస్కరించాలని అనుకున్నాను. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లలేదు. కానీ మరొక పది రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముని దర్శించుకుంటానని మాట ఇస్తున్నాను.
ఎల్ల క్రితం భద్రాచలంలో కరెంటు పరిస్థితి సాగునుడి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మన కేసీఆర్ పాలన తర్వాత ఎలా ఉంది ఇక్కడ జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందే కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో మరోసారి రాబోయేది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్
ఏవైనాప్పటికీ మీరు మాకు అవకాశం ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గులాబీ వనంలో కచ్చితంగా భద్రాచలం చేరాలి కారు గుర్తు అభ్యర్థి గెలవాలి.

భద్రాచలం వరదలకు త్వరలో శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం గత రెండు పర్యాయాలు మా ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది ఈసారి మా అభ్యర్థిని గెలిపించండి వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

నా పేరే తారక రామారావు మాకు రాముడు మీద భక్తి లేకుండా ఎలా ఉంటుంది యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాయణం అభివృద్ధి చేస్తాం.

గత రెండు పర్యాయాలు మా అభివృద్ధిగా గెలిపించక పోయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేశాం ఈసారి పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం..

ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కానీ ఇప్పటివరకు 11 ఛాన్స్ లు ఇచ్చారు కానీ ప్రసన్నాసులు దగుల్బాజీలు ఏమి అభివృద్ధి చేశారు మళ్లీ అటువంటి పొరపాటు చేయవద్దు.
ఖమ్మం జిల్లాలో కొంతమంది డబ్బు సమస్యలతో వస్తున్నారు అటువంటి వాళ్ళ మాటలు నమ్మవద్దు.
డబ్బులకి అమ్ముడుపోమని మీరు నిరూపించుకోవాలి అంటే కచ్చితంగా గులాబీ అభ్యర్థిని గెలిపించుకోవాలి….

వెంకట్రావును గెలిపిస్తే ప్రతిమండలంలో ఓల్డ్ స్టోరేజ్ నిర్మిస్తాం.
వెంకటాపురం మండలంలో జూనియర్ కాలేజీలు నేను నిర్మిస్తాను.
భద్రాచలం గ్రామపంచాయతీని మూడు పంచాయతీలు విభజించారు మీరేం కోరితే అదే చేస్తాను మీ మాట కాదని మేము ఏమీ చేయము మాకు ఎటువంటి భేషజం లేదు..
దేవుడి గుడిలో కూడా మొక్కిన తర్వాతే ప్రసాదం పెడతారు అలాగే మాకు ఓటేయండి అప్పుడు మీకు కావాల్సినవన్నీ మేము ఏర్పాటు చేస్తాం కత్తి ఒకడికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా….

కాంగ్రెస్కు ఓట్లు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా

అత్తలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం అలాగే కోడళ్ళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాము అలాగే ఆసరా పెన్షన్ 5000 రూపాయలకు పెంచుతున్నాం.

ఈసారి గెలిచిన తర్వాత రైతుబంధును కూడా 10000 నుంచి 15000 పెంచుతాం

తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తాం.

ఇప్పటివరకు రైతు కుటుంబాలకు మాత్రమే ఇచ్చిన రైతు బీమాను ఇకనుంచి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు జీవిత బీమాను అందజేస్తాం..

ముళ్ళ చెట్టుకు నీరు పోస్తే పువ్వులు వస్తాయా, గాడిదకు గడ్డి వేసి ఆవుని పాలు పిండితే ఎలా అందుకని. అందుకని కారు గుర్తు అభ్యర్థి తెల్లం వెంకటరమణ గెలిపించాలి.


SAKSHITHA NEWS