డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

Spread the love

హైదరాబాద్:
పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారంరోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని కేటీఆర్ తెలిపారు. 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారుల తెలిపారని.. 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రా రెడ్డి మహమూద్ అలీ మల్లారెడ్డి పద్మారావు జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటివల పలు కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అదే కోవలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది…

Related Posts

You cannot copy content of this page