SAKSHITHA NEWS

కోట మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
ఉసిరికాయలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న కోట మైసమ్మ అమ్మవారిని గౌరవ వైరా ఎమ్మెల్యే గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని వైరా నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో పాడిపంటలతో అమ్మవారి దయతో అన్నింటా విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు. సహచర ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారితో ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు
ముందుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పర్సా పట్టాభి రామారావు గారు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికినారు దర్శనమనంతరం వివిధ శాఖల అధికారులతో పోలీసు సిబ్బందితో ఏర్పాట్ల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నారు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులను కోరారు,
ముగ్గురు మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లుగా వాటన్నిటికీ అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నారుఈ కార్యక్రమాల లో మండల కాంగ్రెస్ నాయకత్వం మొత్తం పాల్గొన్నారు


SAKSHITHA NEWS