కొండాపూర్ డివిజన్ పరిధిలోని లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సెప్టెంబర్ నెల నివేదిక ను సూపరింటెండెంట్ డా. వరదచారీ తో కలిసి విడుదల చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా కొండాపూర్ జిల్లా ఆసుపత్రి పనిచేస్తుంది అని, పేదలకు ఒక వరం లాగా పనిచేస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల యొక్క నివేదిక వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
సెప్టెంబర్ నెలలో 310 కాన్పులు జరిగినవి అని ,
వీటిలో సాధారణ కాన్పులు- 189
ఆపేరేషన్ ద్వారా — 121
ఇప్పటి వరకు మొత్తము ఆపరేషన్లు _ 23,015/-
ఇన్ పేషేంట్ లు – 1045
ఆర్థోపెడిక్ ఆరోగ్య శ్రీ కేస్ లు — 37
కంటి శస్త్ర చికిత్సలు — 06
ప్రతి రోజు ఇన్ పేషెంట్ ల సంఖ్య — 200
ప్రతి రోజు ఔట్ పేషెంట్ ల సంఖ్య — 700
బ్లడ్ బ్యాంక్ కొత్త పరికరాలు సమకూర్చుకోవడం జరిగినది అని
మొత్తం డాక్టర్ల సంఖ్య — 30
మొత్తం నర్సుల సంఖ్య — 25
గా ఉన్నాయి అని అదేవిధంగా
జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను మరియు శుచి, శుభ్రత ను పరిగణలోకి తీసుకొని జాతీయ హెల్త్ మిషన్ వారు గతంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందచేసిన సంగతి విదితమే.ఈ ఆసుపత్రిలో ఒకప్పుడూ 40 నుండి 50 వరకు జరిగే ప్రసూతి సేవలు ఇప్పుడు కేసీఆర్ కిట్ వంటి వినూత్న పథకం ద్వారా ప్రతి నెల 350 వరకు ప్రసూతి సేవలు జరుగుతున్నాయి అని , ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వలన ప్రభుత్వ వైద్యం ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి అని ,ప్రభుత్వ ఆసుపత్రులను ప్రయివేట్ కు దీటుగా తీర్చిద్దిద్దుతున్నారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ప్రభుత్వ జిల్లా వైద్య శాల లో వైద్యం కోసం వచ్చే రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 23 లక్షల రూపాయల అంచనావ్యయం తో లిఫ్ట్ ను నిర్మించిన సంగతి విదితమే
వైద్యం కోసం వచ్చే రోగులకు, వృద్దులకు,చిన్న పిల్లలకు లిఫ్ట్ ఎంతగానో తోడ్పడుతుంది అని, ఆసుపత్రి పై అంతస్థులకు వెళ్ళడానికి లిఫ్ట్ సులభతరం గా ఉంటుంది అని,ర్యాంపు లు , మెట్ల ద్వారా నడవలేని వారికి లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని, . అదేవిధంగా ప్రభుత్వ జిల్లా వైద్య శాల ను అన్ని రకాల హంగులతో తో ,సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని , వైద్యం కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యం గూర్చి ఎంతగానో కృషి చేస్తున్నారు అని, ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు అని, ప్రజాఅవసరాల దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మరియు సహాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కలిపిస్తున్నాం అని, 60 రూపాయల బోజనం కేవలం 5 రూపాయలకే పేద ప్రజానీకానికి శుచికరమైన బోజనం అందించడం జరుగుతుంది అని, హోటల్ కి వెళ్లి తినకుండా , క్యారెజ్ లకు స్వస్తి పలుకుతూ ఇక్కడే భోజనం సదుపాయం కలిపించడం అభినందనియం అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు ఈ చక్కటి అవకాశం ను రోగి సహాయకులు, పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వరదచారీ ,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , మియాపూర్ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.