నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు
సాక్షిత : పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామం ఆయన కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టిన పోరాట పటిమ గలిగిన వ్యక్తి అని అన్నారు,స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు బాపూజీ రూపొందించిన సహకార సంఘాల దేశంలోనే ప్రథమం కావడం విశేషం అని ఆయన తెలిపారు,తెలుగు నేలపై సైకిల్ యాత్ర పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు
లక్ష్మణ్ సేవాసదన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశ్, రాజ్ కుమార్,నాయకులు శ్రీనివాస్,సురేష్,శ్రీను, రాము రెడ్డి,కిషోర్, ప్రవీన్,జంగయ్య, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.