సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

Spread the love

సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

సికింద్రాబాద్ 01 మార్చ్ సాక్షిత సికింద్రాబాద్ ఎమ్ జి రోడ్ల లో కిరణ్ టివివిస్ షోరూమ్ ఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించినట్లుగా టివిఎస్ కంపెనీ ఈరోజు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ఏరియా మేనేజర్ విశాల్ విక్రమ్ సింగ్ హాజరై రెండు కొత్త మోడళ్లను లాంఛనంగా ఆవిష్కరించారు. టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ఏరియా సర్వీస్ మేనేజర్, బాలకృష్ణన్ టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, మొరిలిటీ, స్టేట్ హెడ్ రవి కిరణ్, కిరణ్ టివిఎస్, ప్రమోటర్, రాజేష్ ధండా; కిరణ్ టివిఎస్ ప్రమోటర్ సాకేత్ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరణ్ టివిఎస్ మూడు దశాబ్దాలుగా ఎంతో విశ్వసనీయమైన టివిఎస్ డీలర్ జంట నగరాలలోని ఖాతాదారులకు తన సేవలను అందిస్తున్నది.ఐక్యూబ్ మరియు ఐక్యూబ్-ఎస్ అనే ఈ రెండు మోడల్స్, 5 రంగులలో 3 వేరియంట్లలో, అత్యాధునిక సాంకేతితతో దూసుకుపోయే నేటి యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సొగసైన లుక్ మరియు హై-ఎండ్ ఇవిలు,కాలుష్య రహితంగా మరియు శబ్దం లేని రైడ్ ను అందిస్తాయి మరియు పూర్తి డిజిటల్ మీటర్తో సహా సరికొత్త సౌకర్యాలను అందిస్తాయి,హెచ్ఎమ్ఐ కంట్రోలర్, పవర్ మరియు ఎకో.టివిఎస్ ఐక్యూబ్ వేరియంట్లు 3.4 కెడబ్ల్యుహెచ్ పవర్ తో రెండు లిథియం బ్యాటరీల ద్వారా అవసరమైన శక్తిని పొందుతాయి. బ్యాటరీలు మరియు మోటారు రెండింటికీ 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ.లవారంటీతో ఈ వాహనం అందుబాటులో ఉంది.ఇక్యూబ్ రూ.1,15,283 మరియు ఐక్యూబ్-ఎస్ రూ.1.21,413 లఎక్స్-షోరూమ్ ధరతో కస్టమర్లకు అందుబాటు లోఉన్నాయి అన్ని కంపెనీ ప్రతినిధులుతెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page