కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: సూరారపు పరీక్షణ్ రాజ్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి సూరారపు పరీక్షణ్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యంత ప్రజాదరణ పొందిన క్రేజీవాల్ ఢిల్లీలో అత్యంత నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తున్న నాయకుడు అని, అలాంటి వ్యక్తిపై అవినీతిని అంటగట్టాలని బిజెపి మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ అరెస్టులు అని ఆయన తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించడంతోపాటు,భావి భారత ప్రధాని గా అరవింద్ కేజ్రీవాల్ ను దేశ ప్రజలు కోరుకుంటున్నారనే ఉద్దేశంతో బిజెపి మోడీ ఈడిని అడ్డం పెట్టుకొని కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని తెలిపారు. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.