కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి..
ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల ప్రధానమైన ఊహాగానాలకు దారితీసింది..