కేసీఆర్ వెంటే మునుగోడు
అధర్మం పై ధర్మం విజయం
ప్రజాస్వామ్యం గెలిచింది
ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ ఎస్ దే గెలుపు
కుట్రదారులకు చెంప పెట్టు
అభివృద్ధి కి బ్రహ్మరధం
కేసీఆర్ భరోసా తో చరిత్రాత్మక తీర్పు
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
తెలంగాణాలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపని, యావత్ సమాజం కేసీఆర్ వెంటేనని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.మునుగోడు లో ప్రజాస్వామ్యాన్ని అందలం ఎక్కించారని అన్నారు. ప్రత్యర్థి పార్టీపై టీఆర్ఎస్ ధర్మ పోరాటం చేసి,అధర్మo పై విజయదుందుభి మోగించిందని అన్నారు.
సీఎం కేసీఆర్ భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ముందుగా ఊహించిందేనని ఎంపీ నామ చెప్పారు.ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అహంకారం ఓడి ,మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలిచిందని అన్నారు.ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో నియంతృత్వంతో వ్యవహరించినా టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని అన్నారు.మొదటి రౌండ్ నుంచి మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి ఘన విజయంతో విజయకేతనం ఎగురవేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు నామ పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లకు అభినందనలు అన్నారు.మునుగోడు ఫలితంతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమై oదన్నారు.కేవలం డబ్బు , అహంకారం తో పదవికి రాజీనామా చేసి, పార్టీకి ద్రోహం చేసిన ప్రత్యర్ధికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రలోభ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి, కేసీఆర్ కు మునుగోడును బహుమానంగా ఇచ్చారని నామ అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకొని పార్టీని కాపాడుకున్నారని అన్నారు. ఏది ఏమైనా మునుగోడులో ధర్మమే గెలిచిందన్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అని స్పష్టమైనదన్నారు.మునుగోడు విజయంతో టీఆర్ఎస్ వ్యాప్తంగా మరింత ఉత్సహాం తో జైత్రయాత్ర కొనసాగిస్తుందని తెలిపారు.ఈ ఎన్నికల్లో బీజేపీ పై ఉన్న వ్యతిరేకత స్పష్టమైoదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 8 ఏండ్లలో చేసిన కనీవినీ ఎరుగని అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కేసీఆర్ పాలనకే జైకొట్టారని నామ అన్నారు .రానున్న కాలం లో ఏ ఎన్నిక వచ్చినా గెలుపు టీఆర్ఎస్ దేనని మునుగోడుతో స్పష్టమైనదని నామ అన్నారు.