కేసీఆర్…..కుత్భుల్లాపూర్ సమస్యలు కన్పిస్తలేవా

Spread the love

KCR…..Can’t you see the problems of Quthbullapur?

కేసీఆర్…..కుత్భుల్లాపూర్ సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల ఆసుపత్రి ఏమైంది?

డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది?

డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా?

ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే

జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది?

వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్ బెడ్రం ఇండ్ల సంగతేంది?

కుత్భుల్లాపూర్ శ్రీనివాసనగర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్

మినీ భారత్ గా కన్పించే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణణాతీతమని, పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. ఒకవైపు కంపెనీల కాలుష్యం, మరోవైపు డ్రైనేజీ దుర్గంధం జనం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా 2వ రోజు బండి సంజయ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. దారి పొడవునా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వందలాది దరఖాస్తులు బండి సంజయ్ కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కుత్బుల్లాపూర్ సమస్యలను, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించారు…. ఆయన ఏమన్నారంటే…

ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. కనీస మౌలిక సౌకర్యాలు లేవు. విద్యార్థులంతా నేలపైనే కూర్చొని చదువుకుంటున్నరు. చివరకు టీచర్లు కూర్చుంటానికి కుర్చీలు కూడా లేవు.. ‘మన బస్తి – మన బడి’ అని కొత్త స్కీం పెట్టి చేసిందేమీ లేదు. వచ్చిన పైసలను సంపుకునుడు తప్ప…ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీకి సొంత భవనం లేదు. జూనియర్ కాలేజీలోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. పీజీ కాలేజీ లేదు. పారిశ్రామిక వాడగా మారిన నియోజకవర్గంలో కనీసం ఒక్క ప్రభుత్వ ఐటిఐ కాలేజ్, పాలిటెక్నిక్ కళాశాల లేదు.

నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రిని ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీకి దిక్కులేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేవు. బస్తీ దవాఖానల పేరిట హడావిడి చేసిన ప్రభుత్వం అవి ఎక్కడున్నాయో కూడా ప్రజలకు తెలియని దుస్థితి. టిమ్స్ ఆసుపత్రి ( 100 పడకల దవాఖాన) ని మొదట కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయిస్తే, మంత్రి హాస్పిటల్సన్నీ ఇక్కడే ఉన్నాయని.. వ్యాపారం దెబ్బతింటదని అల్వాల్ కు తరలించారు.


ఎక్కడ చూసినా మంజీరా నీటిలో డ్రైనేజీ నీరు కలిసి త్రాగునీరు కలుషితమైతుంది. డ్రైనేజీ పొంగి పొర్లి నిత్యం రోడ్లపైకి వస్తున్నా స్పందించరు. బిజెపి ఆధ్వర్యంలో అనేకసార్లు జలమండలి వద్ద ధర్నాలు చేపట్టిన అధికారులు స్పందన లేదు. కలుషిత నీటి వల్ల ప్రజలు రోగాలతో అల్లాడుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించరు. దోచుకోవడం… దాచుకోవడమే వారి పని. ఇందులో ఒకాయన ట్విట్టర్ టిల్లు బినామీ…


జగద్గిరిగుట్టలో తెలంగాణలోని అన్ని జిల్లాల వాసులున్నారు. వివిధ జిల్లాల నుండి దాదాపు 50 నుండి 60 బస్సులు రోజూ ఇక్కడికి రావడం జరుగుతుంది. సిటీ బస్సులు దాదాపు వందదాకా ఉన్నయ్. జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ నెరవేరలేదు. సీఎం బిడ్డ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చి జగద్గిరిగుట్టకు బస్ డిపో, జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా వాటికి అతీగతీ లేదు.


నియోజకవర్గంలో భూకబ్జాలకు అంతులేదు. చివరకు దేవుని మాన్యాలను కబ్జా చేశారు. జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయానికి 14 ఎకరాలుంటే టీఆర్ఎస్ నేతలతో కబ్జాలతో ఇప్పుడు 2 ఎకరాలకే పరిమితమైంది. ఈ నియోజకవర్గంలో 93 చెరువులుంటే… వాటి చుట్టూ కబ్జాలే… అవి కూడా కాలుష్య కోరల్లో చిక్కుకున్నయి. మురికి నీటితో దర్శనమిచ్చి భూగర్భ జలాలని కాలుష్యం చేస్తున్నాయి. కుత్బుల్లాపూర్ ను మోడల్ మున్సిపాలిటీని, మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న మాటలన్నీ ఒట్టివే. ఇదేనా మోడల్ అంటే..


మిషన్ భగీరథ ద్వారా మినరల్ వాటర్ అందిస్తామన్న సీఎం, ట్విట్లర్ టిల్లు హామీలకు దిక్కులేదు. తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లే రావడం లేదు. దాదాపు 45 MGD త్రాగునీరు కావాల్సి ఉంటే 20 ఎం.జి.డిలు మించి రావడం లేదు. షామీర్ పేట దగ్గర కేశవ్పూర్ రిజర్వాయర్ చేస్తానన్న హామీ ఇంతవరకు పూర్తి కాలే..
డ్రైనేజ్ వ్యవస్థ అద్వాన్నం… నేను పాదయీత్ర చేస్తున్న చోట కూడా డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి వాసన కొడుతున్న ద్రుశ్యాలను కళ్లారా చూశాను.. ఇక్కడోళ్లు ఈ వాసనను ఇంకా ఎట్ల భరిస్తున్నరో అర్ధం కావడం లేదు.
ఇగ రోడ్ల వ్యవస్థ అధ్వాన్నం. కేంద్ర నిధులతో వేసిన మెయిన్ రోడ్లు తప్ప ఏ గల్లీలో చూసినా గుంతల రోడ్లే కన్పిస్తున్నయ్. గుంతకో వెయ్యి రూపాయలిస్తానన్న ట్విట్టర్ టిల్లు… ఒకసారి ఈ నియోజకవర్గానికి రా.. ఎన్ని గుంగలున్నయో తెలుస్తది. ఈడ గుంతలకు పైసలియ్యాలంటే… జీహెచ్ఎంసీ బడ్జెట్ కూడా సరిపోదేమో…
చుట్టుపక్కలనున్న మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికుల్లో 90 శాతం మంది ఈడనే ఉంటరు. వచ్చేదే అరకొర… అందులో అన్నీ కటింగులే..


ఈడ వేల మంది నివసిస్తున్న భూములు వక్ఫ బోర్డువని చెబుతూ ఇబ్బంది పెడుతున్నరు. బీజేపీ అధికారంలొకి రాగానే వక్ఫ్ బోర్డు భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుంది.
కొంపల్లిని ఐటీ హబ్ గా మారుస్తాన్న హామీ గాలికొదిలేశారు. ఈ నియోజకవర్గంలో వేలాది మంది పేదలు 60 గజాల జాగలల్ల ఇండ్లు కట్టుకుని దశాబ్దాల నుండి నివసిస్తున్నరు. వాళ్లకు పట్టాలిస్తానని రెండు ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు మాట తప్పి వేధిస్తున్నరు. ఖాళీ చేయాలంటూ నోటిసులిచ్చి ఇబ్బంది పెడుతున్నరు. బీజేపీ అధికారంలోకి రాంగనే మీ సమస్యను పరిష్కరిస్తాం.
ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇండ్లు లేనోళ్లు లక్షల్లో ఉన్నరు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఈడ లక్ష మందికి పైగా ప్రభుత్వానికి ధరఖాస్తూలు పెట్టుకున్నారు. 13 వేల ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి 3 వేల ఇండ్లు కట్టిస్తామన్నరు. అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు.. బీజేపీ అధికారంలోకి రాంగనే ఇక్కడే కాదు.. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నా..

Related Posts

You cannot copy content of this page