SAKSHITHA NEWS

కట్ట మైసమ్మ శిఖం చెరువు మెల్లగా కబ్జా

సాక్షిత : కుత్బుల్లాపూర్ సూరారం ప్రధాన రహదారి పైన ఉన్న కట్ట మైసమ్మ చెరువు మెల్లగా కబ్జా కి గురైవుతుంది , పట్ట పగలే చెరువు లో మట్టిని నింపుతున్నారు, ఇంత దైర్యం గా పట్టపగలు చేస్తున్నారంటే,అసలు వీరి వెనుక ఎవరు ఉన్నారు, లేకపోతే ఎవరు మమల్ని ఏమి చేయలేరు అనే దిమానా, లేకపోతే నాయకులు,అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది రెవిన్యూ రికార్డుల ప్రకారం చెరువు సర్వే నెంబర్ 94 లో పద్నాలుగు ఎకరాల పదమూడు గుంటలు గా ఉంది,ఇందులో ఎంత ఉందొ ఎంత కబ్జా కి గురైందో చూడాలి మరి,రోజు రోజు కి దీని విస్తీర్ణం తగుతుంది అని స్థానికులు అంటున్నారు,అధికార యంత్రాంగం నిద్రిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయ్ , అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్టుగా తెలిసి తెలీనట్టుగా ఉంటున్నారు అని ఇక్కడి స్థానికులు అంటున్నారు, రోజు రోజుకి పెరుగుతున్న భూమి ధరలు అదును చూసి మింగేస్తున్న భూ బకాసురులు, కొందరైతే ఆ కట్ట మైసమ్మ తల్లి ఆ చెరువు ని కాపాడాలి అంటున్నారు, ప్రజలలో అధికారులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు అని, అక్రమాలని అరికట్టలేని అధికారులు ఎందుకు అని మరి కొందరు ఏదైతేనేమి కట్ట మైసమ్మ చెరువు ని అధికారులు కాపాడాలి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు, ప్రజల కోరిక మేరకు అధికారులు తమ బాధ్యతలు నిర్వహించి చెరువుని కాపాడతారో లేదో వేచి చూడాలిసిందే.


SAKSHITHA NEWS