SAKSHITHA NEWS

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కే తెలంగాణ ముదిరాజ్ సంఘం ఎల్లమ్మబండ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ కి సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ ఏకగ్రీవ తీర్మానం పత్రం ను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి వివేకానంద నగర్ లోని వారి నివాసంలో అందచేసిన ముదిరాజ్ సంఘం సభ్యులు*

ఏకగ్రీవ తీర్మానం చేసిన తీర్మానం పత్రం ను ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి అందచేయడం జరిగినది

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు కాసాని జ్ఞానేశ్వర్ గారికే ఉంటుంది అని, ఏకగ్రీవ తీర్మానం అందచేయడం జరిగినది అని, మా ముదిరాజ్ ల ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం అని, బీసీల ఐక్యత ను చాటుదాం అని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తాం అని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. మేము అంతా ఐక్యం గా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటాం అని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తాం అని,నిత్యం అందుబాటులో ఉండి ,మాకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలుగా అండగా ఉంటారు అని, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని ,మంచి మనసున్న వ్యక్తి ఆరెకపూడి గాంధీ నేతృత్వంలో ఎంపీ అభ్యర్థి ని కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించుకుంటాం అని ముదిరాజ్ సంఘం నాయకులు ముక్తకంఠంతో తెలియచేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

ఏప్రిల్ 13 న చేవెళ్ల లో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభను సమిష్టి కృషితో విజయవంత చేద్దాం ,శేరిలింగంపల్లి నుండి భారీగా తరలి వెళ్లి కేసీఆర్ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే గారు తెలియచేసారు. కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అని , బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ,సమిష్టి కృషి తో పని చేద్దాం ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జోగిపేట బాల్ రాజు, తెలంగాణ ముదిరాజ్ సంఘం ఎల్లమ్మబండ సలహదారుడు చిన్నోళ్ల శ్రీనివాస్ ,అధ్యక్షులు కనకయ్య ,జనరల్ సెక్రటరీ సత్యనారాయణ , రాములు ,నర్సింహ ,జంపయ్య, వెంకటేష్, రమణ, మల్లేష్, రామచందర్, రాముడు, హన్మంత్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS