నాగర్ కర్నూల్ – కొల్లాపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. వాచ్ మెన్ గా పనిచేస్తున్న నిరంజన్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ విద్యార్థిని ప్రేమ పేరుతో వెంటపడి వేధించి బుట్టలో వేసుకున్నాడు.రాత్రి సమయంలో విద్యార్థినితో అదే పాఠశాలలోని తరగతి గదుల్లో ప్రేమ కాపురం చేశాడు. చివరికి గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించి ఇద్దరూ కలిసి పాఠశాల నుంచి పరారయ్యారు. బాలిక కోసం వచ్చిన బంధువులకు విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో, 376 కేసులు నమోదు చేసి నిందితుడిని నాగర్ కర్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈనెల 17న రిమాండ్ కు తరలించారు.కాగా ఈ విషయం గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి ఓ రాజకీయ పార్టీలో ఉంటూ మైనార్టీ గురుకులంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతనికి గతంలోనే రెండు పెండ్లిల్లు జరిగినట్లు స్థానికులు ద్వారా తెలిసింది. వాచ్ మెన్ గా పనిచేస్తున్న తాను వక్రబుద్ధిని విద్యార్థులపై చూపుతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి పై మనసు పడి ప్రేమ పేరుతో వెంటబడి శారీరకంగా వాడుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.