కల్వకుర్తిపోలీసుల చాకచత్యంతో అక్రమ ఇసుక 5ట్రాక్టర్లను. ఒక జెసిబి ని పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు

Spread the love

తోటపల్లి వాగు నుండి అక్రమ ఇసుక రవాణా ఇసుకతో నిండిన 5 ట్రాక్టర్లు వాగులో ఉన్నాయని సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్ళిన కల్వకుర్తి పోలీసులకు 5 అక్రమఇసుకతో నిండిన ట్రాక్టర్ లు.ఒక జెసిబి ని పట్టుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇట్టి ట్రాక్టర్లు శ్రీనివాస్ గౌడ్. బాలా గౌడ్.ఇక్బాల్ పాషా. దారా నాగయ్య. కంపెల్ల శివ. వ్యక్తులకు చెందిన అక్రమ ఇసుక ట్రాక్టర్లు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ సందర్భంగా కల్వకుర్తి సిఐ మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఉదయం 3 గంటల ప్రాంతంలో సమాచారం ఇవ్వడంతో అట్టి స్థలానికి వెళ్లి ఒక జెసిబి 5 అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని అట్టివాటిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

Related Posts

You cannot copy content of this page