SAKSHITHA NEWS

Kalvakurti MLA ticket for whom? Group politics in Kalvakurti?

కల్వకుర్తి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ? కల్వకుర్తి లో గ్రూప్ పాలిటిక్స్?
సాక్షిత ప్రతినిధి

-టికెట్ కోసం నలుగురు కీలక నేతల ప్రయత్నాలు.

జైపాల్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని నాయకుల డిమాండ్ అయోమయంలో దిక్కు తోచని స్థితిలోసతమతమవుతున్న కార్యకర్తలు**పార్టీ బలహీనపడే అవకాశం ఉందని ఆవేదన.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో రంగులు మారుతున్న రాజకీయం టిఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటినుంచే నలుగురు కీలక నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కు బలమైన కేడర్ ఉన్నప్పటికీ.

రెడ్డి సామాజిక వర్గం దూరమవుతున్నట్లు చర్చ నడుస్తున్నది. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వచ్చే ఎన్నికలలో టికెట్ వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహులు ఎక్కువ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం టికెట్ కోసం కోటి ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ జెండాను గ్రామ గ్రామాన ఎగరవేసిన నాయకుడు బాలాజీ సింగ్ కూడా ప్రయత్నిస్తున్నట్లు సహితులు చెబుతున్నారు. మరోవైపు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పదేండ్ల నుంచి పనిచేస్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ వస్తుందని అనుచరులు విశ్వసిస్తున్నారు.

“కసిరెడ్డికి ఈసారి కలిసి వచ్చెనా ?”

ప్రస్తుత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించి బంగపడటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ పెద్దలు సముదాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2027 వరకు ఉన్నప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పార్టీ టికెట్ వస్తుందని కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

“బాలాజీ సింగ్ బాధ తీరేనా”

అలాగే, నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమ సమయం లో పార్టీ జెండాను గ్రామ గ్రామాన ఎగరవేసిన నాయకుడు బాలాజీ సింగ్. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బాలాజీ సింగ్ కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ టిఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ పదవితో నెట్టుకొస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అండదండలు ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకి ఇవ్వాలని పార్టీ పెద్దలతో చర్చిస్తున్నట్లు బాలాజీ సింగ్ అనుచరులు చర్చించుకుంటున్నారు.

“గోలి శ్రీనివాస్ రెడ్డి కళ నెరవేరేనా”

అలాగే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గోలి శ్రీనివాస్ రెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యమ సమయం నాటి నుండి ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం 10 సంవత్సరాలకు పైగా నుంచి పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ఈసారి అసెంబ్లీ టికెట్ లభిస్తుందని తన అనుచరులు బలంగా విశ్వసిస్తున్నారు. ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ గత కొన్ని రోజుల నుంచి అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు విడివిడిగా హాజరవుతున్నారు. దీంతో ఎమ్మెల్యేకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య సఖ్యత లోపించిందని పార్టీ నాయకుల మాట. నలుగురు అగ్ర నేతలు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందోనని కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారు. ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.


SAKSHITHA NEWS