బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈమే రకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణం లో తన అనుచరులతో సమావేశమయ్యారు.కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని, రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటి స్తానని చెప్పినట్టు తెలిపా రు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు తెలి పారు.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీనపడిందన్న కడియం..ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు కెసిఆర్ చేసింది ఏమి లేదని ఆయన విమర్శించారు.పార్టీ నేతల నుంచి సహ కారం లభించ లేదని, ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకు న్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయ మని పిలుపు వచ్చిందని, అందరి అభిప్రాయం మేరకు నిర్ణ యం ఉంటుందన్నారు. ఆరూరి రమేష్ వద్దంటేనే కావ్యకు టికెట్ ఇచ్చారని చెప్పారు.తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్న ఆయన.. కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి
Related Posts
దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ…
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ మరియు మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బయలుదేరిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…