SAKSHITHA NEWS

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

భారతీయ సామాజిక కార్యకర్త, కుల రహిత సమాజానికి కృషి చేసిన సంఘ సంస్కర్తగా, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మ‌హాత్మా జ్యోతీ రావు పూలే అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకిరేకల్ సెంటర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడుగా సమాజ అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో విద్య ఎంతో అవసరమని మహిళల విద్య పట్ల ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని కొనియాడారు. స్వార్థం కోసం కాకుండా లాభాపేక్ష లేకుండా భారత దేశంలో సేవ చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన మనందరికీ ఆదర్శ ప్రాయుడన్నారు. చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విజయ్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కేతాఫల్లి మహిళా కన్వీనర్ శృతి, మండల బివిఎఫ్ కన్వీనర్ శివ, సినియర్ నాయకులు గ్యార శేఖర్, నితిన్, వినయ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS