కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ మహిళ కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా అమృత, ఉపాధ్యక్షురాలుగా పుష్ప, జనరల్ సెక్రెటరీగా సుజాత, డైరెక్టర్ గా మంజుల, సహాయ డైరెక్టర్ గా అమృతమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన మహిళా కమిటీ సభ్యులను జ్యోతి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మహిళల కోసం కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలను తీసుకురానున్నదని చెప్పారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోందని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళా సమావేశాన్ని ఈ నెల 10న చేవెళ్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహిళా కాంగ్రెస్ కమిటీలను ఆమె కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకో వాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో నాయకురాళ్లు దేవర సమత, శైలజరెడ్డి, నాగమణి, రమ్య, ప్రత్యుషరెడ్డి పాల్గొన్నారు.