Justice should be done to the students of Junior College and Vocational College in Quthbullapur
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని జూనియర్ కాలేజ్ మరియు ఒకేషనల్ కాలేజ్ విద్యార్ధులకు న్యాయం చేయాలి-NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,టిపిసిసి ప్రతినిధి నర్సారెడ్డి భూపతిరెడ్డి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించిన జూనియర్ కాలేజ్ మరియు ఒకేషనల్ కాలేజ్ పూర్తిగా సమస్యల వలయంలో చిక్కుకున్నది.
స్థానిక ఎమెల్యే తన తండ్రి పేరుపై ఏర్పాటు చేసిన ఒకేషనల్ కాలేజ్ లో విధ్యార్ధులను చేర్పించుకున్న ప్రభుత్వం, కళాశాల కు గుర్తింపు ఇవ్వడం మాత్రం మర్చిపోయారు.దాని ఫలితంగా సుమారు ౩50 మంది విద్యార్ధుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.కళాశాల గుర్తింపు ఇవ్వని కారణంగా నేటికి అక్కడ కనీసం ఒక్క ఉపాధ్యాయ నియామకం కుడా జరగలేదు. కేవలం విద్యార్ధులు రోజు కళాశాలకు వచ్చి తిరిగి వెళ్ళడం జరుగుతుంది.
ఈ విషయం తెల్సుకున్న వెంటనే NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మరియు టిపిసిసి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కళాశాలను సందర్శించి అక్కడ ఉన్న విధ్యార్ధులతో మాట్లాడడం జరిగింది.
కళాశాలలో కనీస సౌకర్యాలైన మంచి నీరు కుడా ఉండకపోవడం ఎంతో విచారకరమైనదని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మరియు టిపిసిసి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి విచారం వ్యక్తం చేసారు.
వారం రోజుల్లో కళాశాల గుర్తింపును ఇవ్వాలని,అదే విధంగా ఉపాధ్యాయ నియామకాలు వెంటనే చేపట్టాలని,మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచిన సరే విద్యార్దులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో NSUI మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు రాహుల్ యాదవ్, NSUI హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అభిజిత్ యాదవ్,NSUI రాష్ట్ర కార్యదర్శి పృథ్వి,జాయింట్ సెక్రటరీ రాకేశ్,బండి సాయి,సంగారెడ్డి, రాజశేకర్,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొర అరుణ్,రాయల దీపక్,పరశురాం గౌడ్,ధర్మారెడ్డి,చింతకింది సురేష్,పోషి మహేష్ తదితరులు పాల్గొన్నారు.