ఆలూరు నియోజకవర్గంలో
కొనసాగుతున్న పాదయాత్ర
వలగొండ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు యాత్ర
ప్రారంభించిన యువనేత
పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్న ప్రజలు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు. ఇది గమనించిన యువనేత లోకేశ్ ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించారు.
కుశలప్రశ్నలు వేస్తూ నీకు అప్పుడే రాజకీయాలు వద్దు, ముందు మంచిగా చదువుకొమ్మని చెప్పారు. బాలుడు వేసుకున్న టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈ రోజుల్లో యువనేత లోకేశ్ మాత్రం బాలుడి భవిష్యత్ కోసం దూరదృష్టితో ఆలోచించారు.
యువగళం పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం ఆలూరు నియోజకవర్గంలోని వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. యువనేత పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. లోకేశ్ తో కలిసి నడుస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో మహిళలు, యువతతో ముఖాముఖి నిర్వహించి లోకేశ్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కారుమంచిలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.