రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శాంతియుత సమ్మె చేస్తున్న జేపిఎస్ లు
చిట్యాల సాక్షిత ప్రతినిధి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈనెల 28వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చిట్యాల మండలం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు శాంతియుత నిరసన సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శాంతియుత నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని
నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ను సర్వీస్ కాలంగా పరిగణించాలన్నారు.
ఓపిఎస్ లను జేపీఎస్ లుగా కన్వర్ట్ చేయాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులకు కుటుంబాలను ఆదుకోవాలి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల జీపీఎస్ మరియు ఓపిఎస్ లు పాల్గొన్నారు.