ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు…
7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం..
పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు..
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సును నిర్వహించారు.
ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం మౌలానా అబ్దుల్ అజీజ్ దువా తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టిడిపి మైనారిటీ అధ్యక్షులు మొయినుద్దీన్ సభా అధ్యక్షత వహించారు…
సమావేశానికి మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముస్టాక్ అహ్మద్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, టిడిపి హెచ్ ఆర్ డి కమిటీ మెంబర్ ఎస్పీ సాహెబ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….
ఈ సందర్భంగా అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ…
మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ 17 సంక్షేమ పథకాలను తీసుకుని వస్తే వైసిపి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది…
మైనార్టీల సంక్షేమం గురించి ప్రశ్నిస్తుంటే నవరత్నాల పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ముస్లిం సామాజికవర్గాన్ని మోసం చేస్తున్నారు…
మైనార్టీ సామాజిక వర్గానికి రావాల్సిన నిధులు నవరత్నాలకు దారి మళ్లిస్తుంటే ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష ఏం వెలగబెడుతున్నారు.
ముస్లిం సామాజిక వర్గ ఓట్లు చిలిపోకూడదు అందరం కలిసి ఐకమత్యంతో ఒకే పార్టీకి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలి.
ముస్లిం సామాజిక వర్గం ఓట్లతో వైసిపి 151 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఆ పరిస్థితులు లేకుండా చూడాలి. అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మా తరం ముస్లిం నాయకులు ప్రజలకు ఎనలేని సేవ చేశాం. నారా చంద్రబాబునాయుడు తర్వాత నారా లోకేష్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు…
అబ్దుల్ అజీజ్ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి. నేటి యువ నాయకుడు నారా లోకేష్ తో కలిసి మా స్థానంలో ముస్లిం సామాజికవర్గ వారసత్వంగా అబ్దుల్ అజీజ్ కొనసాగుతారు…..
భవిష్యత్తులో అబ్దుల్ అజీస్ కు దేశ స్థాయిలో పేరు వచ్చే విధంగా పదవి కట్ట పెట్టి రాష్ట్రం లో ఉన్న 60 లక్షల మంది ముస్లిం ప్రజానీకానికి సహకారం అందించే బాధ్యత పెట్టనున్నారు…
60 లక్షల మంది మైనారిటీ ప్రజానీకానికి దిక్సూచిగా నిలిచే శక్తి, చొరవ, పట్టుదల సమర్థత అజీజ్ కు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నారా లోకేష్ తో కలిసి మైనార్టీ ప్రజానీకానికి అజీజ్ కచ్చితంగా ఒక దిక్సూచి లా నిలబడతారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
స్వయంకృషితో జీవిస్తూ సమాజం కోసం తమ వంతు కృషి చేయాలని పనిచేస్తున్న వారు ముస్లిం నాయకులు. మన స్థితిగతులు మారాలంటే ముందు మనం మారాలి..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరెవరు కాపాడలేరు. మీరు సమాజంలో ప్రజల పాత్ర పోషించడం లేదు నాయకుల పాత్ర పోషిస్తున్నారు ప్రశ్నించడం అలవాటుగా మార్చుకోండి…
ముస్లిం సమాజంలో చేతివృత్తుల పనులవారు చిరు వ్యాపారస్తులు అధికంగా ఉన్నారు. వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది
బడుగు బలహీన వర్గాలకు సబ్సిడీతో వ్యాపారాలకు సహకరిస్తున్నట్టు మైనారిటీలకు కూడా 50% సబ్సిడీతో పరిశ్రమల ఏర్పాటు కు కోటి రూపాయలు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టెలా చూస్తాం.
మైనార్టీ లు ఆర్థికంగా బలమైన నాయకులు కాకపోవచ్చు మానసికంగా మాత్రం ముస్లిం నాయకులు గొప్పవారు. మీ హక్కులను మీరు తెలుసుకోండి.
ప్రజా సమస్యలను తెలుసుకోండి ప్రజా సమస్యలను రాయండి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేద్దాం.
గత ఎన్నికల శైలి వేరు ఈ ఎన్నికల శైలి వేరు. ఈసారి ఎన్నికల్లో సానుభూతితో కాదు చైతన్యంతో పని చేయాలి..
ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముస్టాక్ అహ్మద్ మాట్లాడుతూ…
చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జగన్మోహన్ రెడ్డి పెద్దదిగటం ఖాయం ఇన్షా అల్లా…
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత తెలుగుజాతి పై ముస్లిం సమాజంపై ఉంది ముస్లిం సమాజం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు…
జగన్ రెడ్డి అండ్ కోపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని దాచుకున్నారు. రాజకీయాలే అజెండాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
తమ స్వలాభం కోసం వైసిపి నాయకులు ముస్లిం సమాజం యొక్క గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి వద్ద తాకట్టు పెట్టారు. మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైసిపి ది..
అబ్దుల్ అజీజ్ నెల్లూరు జిల్లా లో ఓ పర్వతంలో పార్టీకి అండగా ఉన్నారు వారి నాయకత్వంలో జిల్లాలో అధిక సీట్లు గెలిపించుకోవాలి..
కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, జలీల్, హయాద్ భాషా, ఇమామ్ బాషా, నన్నే సాహెబ్, రఫీ, ఖాదర్ భాషా, మస్తాన్, నియామతుల్ల, సాబీర్ ఖాన్, నౌషాద్, జహీర్, యశ్రాబ్, ఇక్బాల్, బాబు, రహీమ్, ఇందాద్ తదితరులు పాల్గొన్నారు