SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు గ్రామ శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఉదయం 10:00 గంటల నుంచి 03:00 గంటల వరకు ఆడిటోరియం నందు ప్రముఖ ఎన్ ఎస్ డి సి & స్కిల్ ఇండియా శిక్షణ భాగస్వామి ఇమార్టికస్ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అర్హత, ప్రతిభ కలిగిన 30 మందిని ఎంపిక చేసి వారిని తదుపరి ఇంటర్వ్యూలకి సెలెక్ట్ చేయడం జరిగింది.
ఈ జాబ్ మేళాకి చుట్టుపక్కల ఉన్న ఖమ్మం, భద్రాచలం, ఇల్లందు, మహబాద్,వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.


ఈ ప్రాంగణ నియామకాలకి ఇమార్టికస్ కంపెనీ నుంచి హెచ్.ఆర్ కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దరిపల్లి కిరణ్ ప్రిన్సిపాల్ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ కళాశాలలో ప్లేస్మెంట్ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్లేస్మ్ంటే లక్ష్యంగా మా కళాశాల “దరిపల్లి ప్లేస్మెంట్ వింగ్” పనిచేస్తుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కిరణ్ మాట్లాడుతూ కళాశాల నుండి కంపెనీలకు మా దగ్గర నుంచి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు పంపించే విధంగా పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేసెమెంట్ ఆఫీసర్ మలోత్ లాలూ, కళాశాల సిబ్బంది ప్రవీణ్ రవిచంద్ర, ప్రభాకర్,ప్రసన్న , సందీప్, వెంకట్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేశారుచేశారు.


SAKSHITHA NEWS