Jayapradam TWJ Joint Nalgonda District Mahasabha to be held at Yadadri
యాదాద్రిలో జరిగే టీయూడబ్ల్యూజే ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభను జయప్రదం చేయండి రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య
ఉమ్మడి జిల్లా మహా సభలను ప్రారంభించనున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృత ప్రచారం
యాదగిరిగుట్టలో జరగబోయే టీయూడబ్ల్యూజే(హెచ్-143)ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలకు జిల్లాలోని జర్నలిస్టులంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే(హెచ్ 143) ఆహ్వన సంఘం కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. జిల్లాలోని భువనగిరి, బీబినగర్, భూధాన్ పోచంపల్లి, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట, అడ్డగూడూరు, మోత్కురు, ఆత్మకూరు, గుండాల మండలాల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూనే,ప్రస్తుతం నెలకొన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘ నాయకత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.100 కోట్ల నిధులను కేటాయించారని వాటిని జర్నలిస్టుల సంక్షేమం కోసం వెచ్చిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో పలువురి జర్నలిస్టులకు అమలు చేసిన కృషిని ఉదహరించారు. ఒక వైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల కోసం కృషి చేస్తూనే, మరోవైపు జర్నలిస్టుల సంక్షేమానికి కావలసిన ప్రణాళికను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ మీడియా అకాడమీకే దక్కిందని స్పష్టం చేశారు. అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ కరోనా కాలంలో వేలాది మంది జర్నలిస్టులకు అండగా నిలబడిందని వెల్లడించారు..
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం
ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి మహాసభలు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ప్రారంభo కానున్నట్లు టియుడబ్యూజే హెచ్ 143 అహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ ప్రారంభించే ఈ సభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, హాజరు కానున్నట్లు వారు పేర్కొన్నారు.
కాగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ లతో పాటు సంఘ భాద్యులు హాజరవుతారని చెప్పారు. ఈకార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ మెంబర్ దుడుక రామకృష్ణ, మనతెలంగాణ స్టాపర్ తిరుపతి నాయక్, మెట్రో బ్యూరో రిపోర్టర్ కందుల శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్టు బూడిద శ్రీవారి, చన్ రాజ్ శేఖర్, వివిధ మండల రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.