పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమo

Spread the love

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంమాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు గ్రామస్తులను ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇళ్లు లేనివారికి గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో అధికారులు సమాధానం చెప్పాలని సూర్యచంద్ర అన్నారు.బస్సు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం లేదని అన్నారు. వేసవి అలవెన్సులు ఇచ్చేవరకు తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. కూలీల పక్షాన తాము పోరాటం చేస్తామని అన్నారు.

నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కార్పొరేట్ తరహా అభివృద్ధి చేస్తామని, నియోజకవర్గ ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చూస్తామని మండల కేంద్రాల్లో ముప్పై పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని, మేజర్ పంచాయతీల్లో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని, గిరిజన గ్రామాల్లో రోడ్లు మంచినీటి సమస్య, విద్యా, వైద్యం, అందేలా కృషి చేస్తామని అన్నారు. అలాగే మాకవరపాలెం మండలంలో అనరాక్ నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని, సుమారు 2500 మందికి ఇస్తామన్న రెండు సెంట్లు స్థలం ఇప్పటికీ కేటాయించలేదని దీనికి సంబంధించిన భూమి కూడా సిద్ధంగా ఉన్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఇవి అన్నీ కూడా పరిష్కారాలు పరిష్కరించే దిశగా జనసేన ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పట్టణ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, స్థానిక నాయకులు కామిరెడ్డి అర్జున,నక్కా గోవిందు,ప్రసాద్,కామిరెడ్డి శ్రీను, పైలనాయుడు, నంగిశెట్టి గోవిందు, నమ్మి రమణ రాజు, కర్రీ సంతో.

Related Posts

You cannot copy content of this page