SAKSHITHA NEWS

జనసేన ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలో భారీ ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు?

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం బహిరంగ సభలకు కొన్ని కండీషన్లు పెట్టడంతో అది జనసేన పార్టీకి సమస్యగా మారుతోంది.పదో వార్షిక ఆవిర్భావ సభను అత్యంత అట్టహాసంగా జరపాలి అనుకున్న ఆ పార్టీకి పోలీసుల ఆంక్షలు సమస్యగా మారుతున్నాయి.అయినప్పటికీ ఉన్నంతలో ఘనంగా నిర్వహించేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ ఏర్పాట్లు చేశారు.ఇవాళ్టి సభలో అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తోపాటూ కొందరు కీలక నేతలు పాల్గొంటున్నారు.2014 మార్చి 14న జనసేన పార్టీ పుట్టింది.ఇప్పటికి 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 

ఆంధ్రప్రదేశ్‌తోపాటూ తెలంగాణలోనూ యాక్టివ్ గానే ఉంది జనసేన.అందువల్ల పదో ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలూ వస్తున్నారు. పోలీసుల ఆంక్షల్ని లెక్కలోకి తీసుకొని100 ఎకరాల్లో సభ,పార్కింగ్ అన్నీ పక్కాగా ఉండేలా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ దగ్గరుండి చూసుకున్నారు.ఈ సభ 35 ఎకరాల్లో ఉంటుంది.దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు.శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక అని పెట్టారు.


SAKSHITHA NEWS