SAKSHITHA NEWS

శాంతి స్థాపనే జమాఅతె ఇస్లామి హింద్ ధ్యేయం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జమాఅతె ఇస్లామి హింద్ గత 75 సంవత్సరాలుగా సమాజంలో సోదర భావాన్ని పెంపొందించేందుకు అహర్నిశలు క్షృషి చేస్తుందని జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ హమిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. జమాతే ఇస్లామి హింద్ 75 పూర్తి కాబోతున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో జమాఅతె ఇస్లామి హింద్ అర్బన్ జిల్లా అధ్యక్షులు అబ్రార్ అలీ అధ్యక్షతన జరిగిన విద్యావంతుల సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ జమాఅతె ఇస్లామీ హింద్ కు అనేక శాఖలు ఉన్నాయని ఎస్ఐఓ. జి ఐ ఓ, మహిళా విభాగం .ఎంపీజే, ఏపీ సి ఆర్, సద్భావన ఫోరం, ధార్మిక జన మోర్చా, ఐటా, ఐ వై మ్ వంటి అనేక శాఖలతో విద్యార్థుల్లో యువకుల్లో స్త్రీలలో పురుషుల్లో నైతికతను పెంపొందించి సమాజంలో వారు ఉన్నత పౌరులుగా జీవించే విధంగా వారికి శిక్షణ ఇస్తుందని అన్నారు. జమాతే ఇస్లామి హింద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో చెడును పారద్రోలి మంచిని స్థాపించడం తద్వారా ప్రజలందరూ కూడా కుల మతాలకతీతంగా సోదరుభావంతో మెలుగుతూ ఒకర హక్కులను మరొకరు గౌరవిస్తూ శాంతియుతంగా జీవితం గడపటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. జమాత్ సామాజిక సేవ విభాగం ద్వారా పేదలకు అభాగ్యులకు వితంతువులకు రోగగ్రస్తులకు సహాయం చేయడంతో పాటు సమాజంలో విపత్తుల సంభవించినప్పుడు ఆ ప్రదేశంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. జమాత్ ప్రజలకు వ్యక్తిగత శిక్షణతో పాటు సమాజ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తుంది అన్నారు. మానవులందరూ ఒకే చోట జీవిన మనుగడ సాగించినప్పుడు ఒకరికొకరు సోదర సోదరీమణలు పరస్పరం గౌరవించుకున్నప్పుడు సమాజంలో శాంతి సామరస్యాలు పెంపొందుతాయన్నారు. అనంతరం ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు మొహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ సాదిక్ అహ్మద్, జనాబ్ ముప్తి జలాలుద్దీన్ ఖాస్మి, జనాబ్ ముప్తి అబ్దుర్రవూఫ్ ఖాన్ ఖాస్మి, జనాబ్ మౌలానా హిమాయతుల్లా జమాత్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యాక్రమములో రూరల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, ఖిల్లా అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ సుబర్, ఇందిరానగర్ అధ్యక్షులు జమీల్ అహ్మద్ ఖాన్ సభ్యులు నిహల్ అహ్మద్,రఫీ,మునీర్, జైనుల్ పాషా , అబ్దుల్ ఖలీక్ ,మహిముద్ షరీఫ్ అబ్దుల్ లతీఫ్, నిజాముద్దీన్, అబ్దుల్ సమి, అబ్దుల్ మలిక్, జాఫర్ మతిన్, యుసూప్ షరీప్, అబ్దుల్ రజాక్, గౌస్, షేక్‌ ఇలియాస్‌ , ఇంతియాజ్‌, అబ్దుల్ హాది, ఎస్ ఐ ఓ పట్టణ అధ్యక్షులు ఆమెర్ కార్యదర్శి పైజాన్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్, పట్టణంలోని ప్రముఖ విద్యావేత్తలు మరియు కార్యకర్తలు తదతరులు పాల్గున్నారు.


SAKSHITHA NEWS