కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కాకినాడ మత్స్యకారులు కలిశారు. నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు..
కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా దగా చేసిందన్నారు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతర పనిముట్లు అందజేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్య సంపదను అమ్ముకునేందుకు అనువైన షెడ్లు ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ తెలిపారు. కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చి స్థానిక మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు..