జగనన్న అటవీ హక్కుల చట్టం గిరిజనులకు వరం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
31 మంది రైతులకు42.87 ఎకరాల అటవీ భూముల పట్టాల పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన అటవీ హక్కుల చట్టం.. గిరిజనులకు వరంగా మారిందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఫారెస్టు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రైతులకు అటవీ హక్కు దారుల పుస్తకాలు అందజేశారు. అచ్చంపేట మండలంలోని పెదపాలెం, తాడువాయి, కొండూరు గ్రామాలకు చెందిన 31 మంది గిరిజన రైతులకు 42 ఎకరాల 87 సెంట్ల భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత గిరిజనుల మేలు కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎందోమంది పేదలకు భూ హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న భూ హక్కు పట్టాలతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. రైతులు కూడా తమకు అందిన భూముల్లో వ్యవసాయం చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన 11 మంది రైతులు, కొండూరు గ్రామానికి చెందిన 11 మంది రైతులు, తాడువాయి గ్రామానికి చెందిన 8 మంది రైతులకు మొత్తం 42 ఎకరాల 87 సెంట్ల భూమికి సంబంధించిన అటవీ హక్కుదారుల పాసుపుస్తకాలు అందుకున్నారు. తమ కష్టాలను గుర్తించి తమకు భూమిపై హక్కు కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కి, కృషి చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.