SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామం పంచాయతీ. లో జగనన్న సురక్ష ప్రోగ్రాం. నిర్వహించడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో. 11. రకాల ముఖ్యమైన సేవలు. ఉచితంగా అందజేయడం జరిగినది. అందులో భాగంగా చిత్తపార సచివాలయం లో జూలై 18 వ తేదీన జగనన్న సురక్ష ప్రోగ్రాం జరిగింది.
ఈ ప్రోగ్రాం లో భాగంగా 11 రకాల ముఖ్య సేవలు ఉచితంగా అందజేయబడినది. అందులో భాగంగా 600 పైచిలుకు సర్వీసులు ఈ సచివాలయం పరిధిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ రాజేంద్ర ప్రసాద్ గారు, స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి గారు, ఇంఛార్జి ఈఓ పీ ఆర్డీ చంద్ర గారు, మండల వైస్ ఎంపీపీ గోపి గారు, చితపార బండపల్లి సర్పంచ్ లు, వార్డు మెంబర్లు,గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకుమార్, వి ఆర్ వో సురేష్ బాబు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పెద్దలు శ్రీధర్ రెడ్డి. సర్పంచ్ రవి. వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం స్టేట్ యూత్ లీడర్ టి కృష్ణమూర్తి రెడ్డి. నీల్ రాజు. మరియు తదితరులు గ్రామస్తులు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బాబు రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.జగనన్న సురక్షకు విశేష ఆదరణ, ఒకే రోజు 3,11,731 సేవలు

● ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అయిన జగనన్న సురక్షతో, ప్రజలకు అవసరమైన పథకాలు లేదా సర్టిఫికేట్‌లకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వేను నిర్వహిస్తోంది.

● ఇప్పటివరకు ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,13,00,567 గృహాలు పూర్తి చేయబడ్డాయి. ఫలితంగా 50,42,154 మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు.

● సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలు ధృవపత్రాలను పంపిణీ చేయడానికి, పౌరుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఒక వేదికగా పనిచేస్తున్నాయి.

● రాష్ట్ర వ్యాప్తంగా 15,000 శిబిరాలను నిర్వహించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 9,720 క్యాంపులను విజయవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది.

● పథకాలు లేదా సర్టిఫికేట్‌లకు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం ప్రజలు 1902 ప్రత్యేక హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. సత్వర సేవలను అందించి ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.


SAKSHITHA NEWS