ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు.
ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన నామినేషన్ కి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదట జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ 22వ తేదీన అనుకున్నా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు శ్రీకాకుళంలో 24 వ తేదీన కానుండడం వలన అనుకున్న ప్రకారం పులివెందులలో 22వ తేదిన అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు.
24 వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా జగన్ మోహన్ రెడ్డి పులివెందుల చేరుకొని, 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. పులివెందుల లో జగన్ మోహన్ రెడ్డి ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి భారతీ రెడ్డి స్వీకరించగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత ప్రచారం మొదలు పెడతారు.
25 వ తేదీన నామినేషన్ అయ్యాక సీఎం జగన్ మోహన్ రెడ్డి మలివిడత ప్రచారం మొదలు పెడతారు. ఇందులో భాగంగా 27 లేక 28 వ తేదీన విజయవాడ వెస్ట్ లో జగన్ మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.