జగద్గిరిగుట్ట నుండి షాపూర్ నగర్ కు ఫోర్ లైన్ రోడ్డు వేయాలని సీపీఐ నేతలు ఎమ్మెల్యేకు వినతి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట శాఖకు చెందిన సీపీఐ నేతలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగద్గిరిగుట్ట నుండి షాపూర్ నగర్ వెళ్లే పైప్ లైన్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, సమస్య పరిష్కారానికి ఫోర్ లైన్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీలో ఎలక్ట్రిసిటీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసు రత్నం తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట నుండి షాపూర్ నగర్ కు ఫోర్ లైన్ రోడ్డు వేయాలని సీపీఐ నేతలు ఎమ్మెల్యేకు వినతి
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…