SAKSHITHA NEWS

వర్షం పడింది.. బస్సు ఆగింది!

వైరా: ఓ వైపు వర్షం కురుస్తోంది.. ఇంతలోనే బస్సు ఆగింది.. మరోవైపు పరీక్షకు సమయం సమీపిస్తోంది.నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న అధికారుల హెచ్చరికతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.చివరకు ఆటోలో సకాలంలోనే కేంద్రానికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నా రు. వైరా మండలం ముసలిమడుగులోని తెలంగాణ గిరిజన బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.కొద్దిదూరం వెళ్లగానే రోడ్డు బురదలో దిగబడింది.దీంతో విద్యార్థినులు కిందకు దిగి నెట్టినా బస్సు కదలకపోవడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేంద్రమ్మ,ఎంఈఓ వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వగా వారు నాలుగు ఆటోలను పంపించారు.

దీంతో ఆటోల్లో కేంద్రానికి చేరుకోవడంతో అప్పటి వరకు ఎదుర్కొన్న ఉత్కంఠకు తెరపడింది.కాగా,తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన వేల్పుల రాకేష్‌ వర్షం కారణంగా బస్సులు లేక ఆటోలో పరీక్షా కేంద్రానికి వచ్చేసరికి నలభై నిమిషాలు ఆలస్యమైంది.దీంతో గురుకుల బాలికల కళాశాల అధికారులు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.


SAKSHITHA NEWS