SAKSHITHA NEWS

సిగ్గుండాలి మాట్లాడటానికి
అమెరికా పబ్ క్లబ్ కల్చర్ నీది
దేశానికి అన్నం పెట్టిన కల్చర్ కాంగ్రెస్ ది
కేటీఆర్ పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఫైర్
రైతుకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది
రాహుల్ గాంధీపై విమర్శ అవివివేకం
నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
:

రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి కేటీఆర్ పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ ఆరోపణలు సిగ్గు చేటని విమర్శించారు. కేటీఆర్ మాటలు వింటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక దిక్చూచి అని కష్ట కాలంలో దేశానికి అన్నం పెట్టిన చరిత్ర కలిగిన కుటుంబ వ్యక్తిపై ఆరోపణలు చేయడం నీచ సంస్క్రుతి నిదర్శనం అని ధ్వజమెత్తారు. అమెరికా క్లబ్, పబ్,ఢిల్లీ లిక్కర్ స్కాం కల్చర్ మీ కుటుంబానిది అని ఆరోపించారు.ఎవరి ప్రభుత్వంలో రైతుకు మంచి జరిగిందో రైతులకు తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులకూ తెలుసని అని అన్నారు. చేయని పని చేస్తున్నామని చెప్పుకోవడం బీఆర్ఎస్ కు కేసీఆర్ కుటుంబానికి వెన్నెతో పెట్టిన విద్య అని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుకు చేస్తున్న అన్యాయాలపై, తప్పుడు వాగ్దానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అందులో భాగంగా టిపిసిసి ఇచ్చిన పిలుపుమేరకు అన్ని నియోజకవర్గ మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. వరి వేసిన వాళ్ళకి ఉరి తప్పదని, మద్దతు ధర అడిగిన రైతుకు బేడీలు వేసిన నీచ సంస్కృతి బిఆర్ఎస్ పార్టీది అని స్పష్టం చేశారు. అరకొర రైతుబంధుతో, రైతు చనిపోయాక వచ్చే రైతు బీమా తో వ్యవసాయానికి వచ్చే అన్ని రాయితీలు, భోనస్ లు, వసతులను ఎగ్గోడుతున్నారని అన్నారు. ధరణి పేరుతో రాత్రికి రాత్రే భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటుంది కేటిఆర్ కుటుంబం కాదా అని అన్నారు. కేటిఆర్ హరీష్ రావు కు ఓటమి బయం పట్టుకుందని ఇప్పటి నుండే విమర్శించడం నేర్చుకుంటున్నారని హితవు పలికారు. రైతు వేదికలు పార్టీ కార్యక్రమాలకు వాడుకోవాలని చూస్తున్నారని అదే రైతు వేదికల దగ్గర రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అక్కడకు ఏ బీర్ఎస్ నేత వచ్చినా ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు. అధికారులు ప్రభుత్వానికి ఏజెంట్లల వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుల ఆస్తి పాస్తులపై వారి కన్ను పడిందని ఆరోపించారు. రాబోయోది రైతు ప్రభుత్వం అని రైతు డిక్లరేషన్ అమలు చేసుకోవడం కాయమని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో వీరితో పాటు జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరబద్రం,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు జిల్లా ఏస్ టి సెల్ అధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర మైనారిటి నాయకులు బి యచ్ రబ్బాని,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా యస్ సి సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,నాయకులు మారం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS