SAKSHITHA NEWS

సభ్యత్వ నమోదులో పెందుర్తి రాష్ట్రంలోనే రెండు వ స్థానంలో నిలవడం అభినందనీయం.

సాక్షిత :- జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా 26 వేలు పై చిలుకు సభ్యత్వాలు నమోదుతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పెందుర్తి నియోజకవర్గం నిలవడం అభినందనీ యమని పెందుర్తి శాసనసభ్యులు వంచ కర్ల రమేష్ బాబు అభిప్రాయ పడ్డారు.

నిర్దేశిత సమయంలో జనసేన చీఫ్ డిప్యూటీ సియం వవన్ కళ్యాణ్ ఆదేశా లుతో మహా యజ్ఞంలా సాగిన సభ్యత్వ నమోదును నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా అంకితభావంతో పనిచేసి పూర్తి చేసార న్నారు. ఇంత పెద్ద ఎత్తున నిర్దేశిత సమ యంలో జనసేన సభ్యత్వాలు నమోదు కావడం హర్షనీయమన్నారు. సభ్యత్వ నమోదులో పెందుర్తిని రాష్ట్రం లో 2వ స్థానంలో నిలిపిన నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులకు, కార్య కర్త లకు, జన సైనికులకు, వీర మహిళలకు ఈ సందర్భంగా పంచకర్ల అభినందనలు తెలిపారు. కాగా సభ్యత్వ నమోదులో 30 వేలుతోపిఠాపురం రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచింది.


SAKSHITHA NEWS