SAKSHITHA NEWS

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిసిన నందవరపు శ్రీనివాస్ రావు.

సాక్షిత:- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎన్ జగన్మోహన్ రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలిసిన పెదముషిడివాడ వైయస్సార్ జనరల్ సెక్రెటరీ నందవరపు శ్రీనివాసరావు.

ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారని అందరూ కలిసికట్టుగా బొత్స గెలిపే లక్ష్యంగా పనిచేయాలని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైకాపా నేతలకు మాజీ సీఎం జగన్ సూచించారు, వైకాపా సానుభూతి పరులు పైన పార్టీ కార్యకర్తలు పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులకు ఎవ్వరూ భయపడి అధైర్య వద్దని మీకు అందరికీ నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు రాబోయే 2029లో మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరంతా వైకాపా గెలిపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు..


SAKSHITHA NEWS