అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

SAKSHITHA NEWS

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొర్లుతుంది అన్న విషయం తెలుసుకొన్నకూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి డ్రైనేజీ పొంగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఏమ్మేల్యే మాట్లాడుతూ ఈ విధంగా డ్రైనేజీ పొంగుతుంటే డ్రైనేజీ నీళ్లు ఇండ్ల లోకి చేరుతుంది, దవే వలన ప్రజలు అనారోగ్య సమస్యలకు గురౌతారు, కావున వీలైనంత త్వరగా డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి అని, 20 వేల లీటర్ల మంచినీళ్ళ వాడుకోవడం కోసం గత ప్రభుత్వం జిఓ జారీ చేసింది. అయినా వాటర్ వర్క్స్ అధికారులు గత ప్రభుత్వంలో వాడుకున్న నీటికి కూడా డబ్బులు కట్టమని ప్రజలకు పిడిస్తున్నారు. ఈ విధంగా ప్రజలను ఇబ్బందులు పెట్టీ డబ్బులు తీసుకొవడం మంచి పద్దతి కాదు అని, పేదవారిని ఇబ్బంది పెట్టీ అధికారులు డబ్బులు వసూలు చేస్తే ప్రజా ఉద్యమం చేస్తాం అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, వీరా రెడ్డి, సయ్యద్ రియాజ్, రమేష్ , ముత్యాల దుర్గ మరియు జి.హెచ్.యం.సి. అధికారులు డి.ఈ.ఆనంద్, ఎ.ఈ.రంజిత్, జలమండలి అధికారులు విలయం ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

SAKSHITHA NEWS