అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 11 at 16.11.00

క్షేత్రస్థాయిలో ప్రజలకు ముఖం చూపించలేక పట్టణాల వెంట పరుగులు తీస్తున్న మాజీ మంత్రి

ప్రజాక్షేత్రంలో డీకే అరుణకు శిక్ష తప్పదు

సుప్రీం కోర్టులో స్టే రావడం పట్ల బిఆర్ఎస్ శ్రేణుల హర్షం

గద్వాల పట్టణంలో బాణాసంచా కాల్చి సంబురాలు

గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండు (వైయస్సార్ విగ్రహం ) దగ్గర గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి సుప్రీంకోర్టు ద్వారా స్టే రావడం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో కొనసాగుతున్న సంబరాలు వేడుకలు ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి , తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి హాజరయ్యారు.

గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి కొన్నిరోజుల క్రితం హై కోర్టు అనహర్హత వేటు వేసినా విషయం అందరికి తెలిసిందే అయితే గద్వాల ఎమ్మెల్యే హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు ఎమ్మెల్యే కి అనుకూలంగా స్టే ఇవ్వడం జరిగింది.

*ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ …

తెలంగాణ ప్రభుత్వం ద్వారా కెసిఆర్ నాయకత్వంలో గద్వాల నియోజకవర్గం అభివృద్ధి ఓర్వలేక పదవుల కోసం తహతహలాడే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే మీద లేనిపోని ఆరోపణలు చేసారు, ఎప్పుడూ దొడ్డిదారిలో వెళ్ళే అలవాటు ఉంది ఇప్పుడు అదే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు ఇచ్చిన పదవి,
ప్రజలిచ్చిన పదవి న్యాయవ్యవస్థ ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటాయి సుప్రీంకోర్టు తీర్పుతారా మరోసారి రుజువైంది అని అన్నారు.

ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని అడ్డమైన ప్రయత్నం చేసిన ఎవరు కూడా ఆపలేరు అని అన్నారు.

మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ…

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి బీజేపీ నాయకుల బంగ్లా నాయకులూ దొడ్డి దారిలో అడ్డదారిలో అధికారం సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో ప్రజలు 2018లో బ్రహ్మాండమైన మెజార్టీ తో మా నాయకుడు గెలిపిస్తే మాజీ మంత్రి ప్రజా తీర్పు అనే కురుక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక కోర్టుకు వెళ్లి ఒక స్థాయిలో ఉన్నాను అనే విషయం మర్చిపోయి చిన్న చిన్న (సంబంధం లేని)విషయాలను చిపించి హై కోర్టులో అన్యాయమైన తీర్పు వస్తే ఆ దీర్ఘం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లిన మన ఎమ్మెల్యేకు రావడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయం అని అన్నారు ఈరోజు ఆ నాయకులకు తెలియజేస్తున్న ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడండి కానీ దొడ్డిదారిలో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు, కృష్ణమోహన్ రెడ్డి మీద కేసు వేశారు ఆనాడు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలలో ఓడిపోయి అదే కోర్టు చేయడం జరిగింది ఈ బంగ్లా నాయకులకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని నాయకులూ కాబట్టే దొడ్డి దారిన పదవులు సంపాదించే అలవాటు మొదటి నుంచే దానికి కారణం వాళ్లకు కుర్చీ లేకపోతే బ్రతలేని పరిస్థితి ఈ రోజు కుర్చీ కోసమే మా నాయకుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మీద లేనిపొని నిందలు వేస్తున్నారు, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నిందలు వేసిన వాళ్ళ ఆటలు సాగలేదు ఇక మీద కూడా సాగవు.

రాబోయే ఎన్నికల్లో ప్రజా కురుక్షేత్రంలో మా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలుస్తారు .

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగర్ దొడ్డి వెంకట రాములు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ, గద్వాల టౌన్ పార్టీ యూత్ అధ్యక్షుడు గంజి పేట మధు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS