Indian Red Cross Society Tirupati District Branch
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖ.
సాక్షిత : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 101 వార్డ్ సచివాలయంలో పనిచేయు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు ఇతరులకు ప్రథమ చికిత్స భాగంలోని CPR ప్రక్రియ పైన అవాగాహన కార్యక్రమం 51 రోజుల పాటు రోజు మధ్యాహ్నం 3:00 నుండి 4:00 వరకు అందిస్తున్నట్టు రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డా” వి. ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశం ప్రజలు CPR ప్రక్రియ పైన అవగాహన పెంచుకుని ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గోల్డెన్ టైం లోపల సమయానికి కాపడుటలో ముఖ్య పాత్ర పోషించాలని నిర్వహిస్తున్నాం.
CPR కార్యక్రమానికి రెడ్ క్రాస్ శాఖ నుండి కోశాధికారి జి .వి.సుబ్బా రావు , డా” జి.ప్రతీత్ , కమిటీ మెంబర్లు రఘురాం రెడ్డి , రాజా మరియు కమిటీ సభ్యులు సహకారం అందిస్తునట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి CPR లోగో ను కూడా తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు మేయర్ డాక్టర్ శిరీష ఆవిష్కరించారు.