Indian Prime Minister Narendra Modi’s visit to Telangana
భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన పై బీజేపీ రాజేంద్రనగర్ అసెంబ్లీ నాయకుల సమావేశం సర్కిల్ లోని EHBAAB హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలు గా బీజేపీ రంగరెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి , జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ కార్పొరేటర్ లు తొకల శ్రీనివాస్ రెడ్డి, మోండ్ర సంగీత గౌరీశంకర్ లు పాల్గొన్నారు.
సమావేశం లో సామ రంగరెడ్డి, వై.శ్రీధర్ లు మాట్లాడుతూ, ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకోనున్నారు, బేగంపేట విమానాశ్రయం లో మోదీకి స్వాగత సభ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేశారు స్వాగతం పలకడానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని, సభ అనంతరం బేగంపేట నుంచి రామగుండానికి ప్రధాని పయనమవుతారనీ, శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్ఎఫ్సీఎల్)ను మోదీ ప్రారంభిస్తారని, ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని,
రామగుండం లో ఆర్ఎఫ్సీఎల్తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, మరియు శంకుస్థాపనలు చేస్తారని. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారనీ రూ.2,200 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి 765 డీజీపై మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్హెచ్-161బీబీపై బోధన్-బాసర-భైంసా సెక్షన్, ఎన్హెచ్-353సీపై సిరొంచా-మహదేవ్పూర్ సెక్షన్ రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని.
ఈ స్వాగత కార్యక్రమానికి డివిజన్ల వారీగా అత్తాపూర్ కు పొన్నమనేని మల్లేష్ యాదవ్, మైలార్ దేవ్ పల్లీ కు మోండ్ర కొమరయ్య, రాజేంద్రనగర్ కు తోకల సుధాకర్ రెడ్డి, మరియు శాస్త్రి పురం, సులేమాన్ నగర్ డివిజన్ లకు రాచూరి రాజశేఖర్ ఇంఛార్జి లుగ ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమం లో చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ ఎన్.మల్లారెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి మోండ్ర కొమరయ్య,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు రాచూరి రాజశేఖర్, తోకల సుధాకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, సాబాద విజయ్, అడికె జనార్ధన్, నిఖిల్, నాయకులు, జోగి రవి, మల్లేష్ యాదవ్, కాడెమ్ సుధాకర్,మూల శ్రీనివాస్ గౌడ్,. కొంగళ్ల నవీన్, సందీప్, ఎన్.జగన్, గొరిగే రాజు, నాగమణి, బి.సిద్ధేశ్వర, సాయి యాదవ్, కాకుకారం కృష్ణ, మోహన్, సురేష్ ముదిరాజ్, మల్లేష్ చారి, ఈ. వేణు, శశికాంత్ శర్మ, ముకేష్, కీర్తి సిను,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
రాచూరి రాజశేఖర్
జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి. 9581316363.